మనుషుల మధ్యే సంచరిస్తున్న మానవ మృగాలు.. 11 ఏళ్ల బాలికపై 17 మంది..

11-year-old-girl-allegedly-raped-for-months-in-chennai-17-arrested

నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేవు అంటూ కామాంధులు రెచ్చిపోతున్నారు. మంచి, మానవత్వం, పాపం, పుణ్యం ఏమీ లేదు. ఆడపిల్ల కనిపిస్తే ఆంబోతుల్లా మీదపడుతున్నారు. తమ కోర్కెల్ని తీర్చుకోవడానికి పావులా వాడుకుంటున్నారు. వారిక్కూడా తల్లి, చెల్లీ ఉన్నారన్న ఇంగిత జ్ఞానాన్ని మరుస్తున్నారు. పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చెన్నైకి చెందిన 11 ఏళ్ల బాలికపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది అత్యాచారం చేశారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి పాపకు ఇచ్చాడు ఓ మెకానిక్. అది తాగిన బాలిక మత్తులోకి జారుకోగానే దగ్గరలోని బిల్డింగ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడే కాకుండా తనకి ఉన్న మిగిలిన స్నేహితులు కూడా బాలికపై అత్యాచారం చేశారు. మళ్లీ దీన్నంతటినీ వీడియో తీస్తూ ఎవరికైనా చేప్పావంటే ఈ వీడీయో లీక్ చేస్తామంటూ బెదిరించారు. అలా గత కొన్ని నెలలుగా మొత్తం 17 మంది బాలికపై అత్యాచారం చేస్తూ వస్తున్నారు. ఆ చిన్నారి వారి లైంగిక వేధింపులు భరించలేక తల్లికి చెప్పింది. ఆమె స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.