అంజీర్ ఆరోగ్యానికే కాదు.. ఆలూ మగల మధ్య అనుబంధానికీ..

anjeer-health-benefits
మేడిపండు చూడు మెరుగులుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు.. అని చిన్నప్పుడు మనం చదువుకున్న పద్యం. ఇది మనుషులను ఉద్దేశించి మాట్లాడతారు. పైకి మంచిగా కనిపిస్తారు. కానీ అనుకున్నంత మంచి మనిషి కాదు అని. అలాగే అత్తిపండు, మేడిపండు అని పిలుచుకునే ఈ పండు కూడా పైకి చూడ్డానికి బావుంటుంది. లోపల ఏవో పురుగులు ఉన్నట్లు ఉంటుంది. కానీ ఈ పండు చేసే లాభాలు మాత్రం అనేకం.  అందరికీ తెలిసిన పేరు అంజీర్. మార్కెట్లో పచ్చిగా దొరుకుతాయి. ఎండువి దొరుకుతాయి. కొన్ని పండ్లు ఎండిన తరువాత మరింత రుచిని, మరిన్ని లాభాల్ని అందిస్తాయి. అలాంటి పండ్లలో అంజీర్ కూడా ఒకటి. 
* అంజీర పండులో పీచు అధికంగా ఉంటుంది. రోజుకి రెండు పండ్లు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
* ఈ పండులో పొటాషియం, సోడియం అధికంగా ఉండడం వలన రక్తపోటు సమస్యని నివారిస్తుంది.
* రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం నూతనోత్తేజాన్ని పొంది దాంపత్య జీవితానికి సహకరిస్తుంది .
* పండులో ఉండే మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజ లవణాలు సంతాన సాఫల్యతను పెంపొందించడానికి దోహదపడుతుంది.
* పిల్లలకు చిన్నప్పటి నుంచి అంజీరను తినే అలవాటు చేస్తే రక్తహీనత సమస్య ఉండదు.
* మహిళలకు పీరియడ్స్ ద్వారా కోల్పోయిన బ్లడ్‌ని తిరిగి శరీరానికి అందించడంలో అంజీర ముఖ్యపాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
* బరువు తగ్గాలనుకునేవారికి కూడా అంజీర మంచి మందులా పనిచేస్తుంది. భోజనానికి ముందు ఓ అయిదారు అంజీరలు తింటే అన్నం తక్కువగా తినవచ్చు. ఇలాంటి ఓ మంచి అలవాటు ద్వారా బరువుని సహజపద్దతిలో తగ్గించుకోవచ్చు. గుండెకు కూడా చాలా మేలుచేస్తుంది ఈ పండు.
* విటమిన్-ఎ, బి1,బి2, క్యాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతో పాటు క్లోరిన్ కూడా లభిస్తుంది.
* పాలు, పెరుగు వంటివి ఇష్టపడని వారు రోజూ 5నుంచి 6 అంజీరలు తీసుకుంటే శరీరానికి కావలసిన క్యాల్షియం, ఇనుము అందుతుంది.
* పండు రూపంలో తినడానికి ఇష్టపడని వారు రోజూ రాత్రిపూట రెండు లేక మూడు అంజీరలను శుభ్రంగా కడిగి గోరు వెచ్చని నీటిలో వీటిని వేయాలి. దాంట్లోనే కొద్దిగా పటిక బెల్లం పొడి కూడా వేసి ఉదయాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్దకం సమస్య తీరుతుంది. ఇలా 45 రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
* నిద్రలేమితో బాధపడేవారికి కూడా పడుకునే ముందు రెండు అంజీరలను తిని వేడి పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది.
* ఈ పండులో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం వలన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌‌ని కరిగించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.