పశువుల్లంక ఘటనలో మరో మృతదేహం..

another-tragedy-in-ap-again-killer-boat-didnt-have-licence
తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక ఘటనలో ఇవాళ మరో మృతదేహం లభించింది. విద్యార్ధిని శ్రీజ మృతదేహంగా గుర్తించారు. యానాం అయ్యనగర్ సమీపంలో చిన్నారి డెడ్ బాడీ లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రోజున గల్లా నాగమణి, నిన్నతిరుకోటి ప్రియ మృతదేహాలు దొరికాయి. దీంతో గల్లంతైన వారిలో ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను కనుగొనగా..మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గల్లంతైన వారిలో కొండేపూడి రమ్య, పదో తరగతి విద్యార్ధిని పోలిశెట్టి వీర మనీషా, తొమ్మిదో తరగతి పోలిశెట్టి అనూష, ఆరో తరగతి విద్యార్ధిని పోలిశెట్టి సుచిత్ర కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఏపీ ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డ్స్, అగ్నిమాపక దళం, ఏపీఎస్పీఎఫ్, డీప్‌ డైవర్స్‌ గాలిస్తున్నారు. దాదాపు 160 మంది 19 బృందాలుగా విడిపోయి నదిలో వేతుకుతున్నారు. వీరికి అదనంగా స్థానిక మత్స్యకారులు ఇంజిన్‌ పడవలతో అన్వేషిస్తున్నారు. నాలుగు డ్రోన్‌ కెమెరాలు, నేవీ హెలికాప్టర్‌ కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ప్రమాదం జరిగిన పశువుల్లంక నుంచి యానాం మీదుగా గౌతమీ నది సుమారు 22 కిలోమీటర్లుంది. ఈ ప్రాంతాన్ని గాలింపు బృందాలు జల్లెడ పడుతున్నాయి. నదికి ఇరువైపుల అంచుల్లో మృతదేహాలు చిక్కుకునే అవకాశం ఉండటంతో వెతుకుతున్నారు.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -