అతడితో రొమాన్స్.. అంగీకరించనందుకు మటాష్..

as-wife-denies-sex-with-husband-suffering-from-cancer-he-slits-her-throat
మనిషి మంచంలో ఉన్నా కోర్కెల గుర్రాలకు రెక్కలు వస్తాయి. అందుకు భార్య అంగీకరించనందుకు ఆగ్రహంతో ఆమెని చంపేశాడు భర్త. ఉత్తరప్రదేశ్ లలిత్పూర్ జిల్లాలో నివసిస్తున్న అజయ్, మమతలకు పెళ్లై 17 ఏళ్లు అయింది. వారికి ఇద్దరు పిల్లలు 16 ఏళ్ల అమ్మాయి, 8 ఏళ్ల అబ్బాయి ఉన్నారు. ఆరు నెలల క్రితం అజయ్‌కి నోటి క్యాన్సర్ రావడంతో ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబం గడవడం కోసం భార్య ఉద్యోగ వేటలో ఉంది. ఈ క్రమంలోనే నోయిడాలోని సోదరుని వద్దకు వెళ్లింది. అక్కడి చిజార్సి గ్రామంలోని ఓ కుట్టు మిషన్ కంపెనీలో ఉద్యోగానికి కుదిరింది మమత.
కుటుంబానికి ఆర్థికంగా సాయపడుతూ, అనారోగ్యంతో ఉన్న భర్తని చూసుకుంటూ సంసారాన్ని నెట్టుకు వస్తోంది. ఆసుపత్రిలో చూపించుకునే నిమిత్తంగా అజయ్ మమత సోదరుడు రాహుల్ ఇంటికి వచ్చారు. అక్కడ భార్యను తన కోర్కె తీర్చమంటూ అడిగాడు. అందుకు భార్య నిరాకరించింది. ఆగ్రహించిన అజయ్ చాకు తీసుకుని విచక్షణారహితంగా గొంతుకోసి భార్యను చంపేసాడు. రక్తపు మడుగులో పడిఉన్న సోదరిని చూసిన రాహుల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల సమక్షంలో తన నేరాన్ని అంగీకరించిన అజయ్ కొన్ని నెలలుగా భార్య తననించి దూరంగా ఉంటుందని, ఒక్కసారి అని అడిగినందుకు అంగీకరించకపోవడంతో చంపేశానని చెప్పాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -