కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే ఊపిరితిత్తులలో చేరుకున్న కఫం..

benefits-of-coconut-oil-mix-with-karpooram
నాలుగు చినుకులు పడితే హచ్.. హచ్.. అంటూ తుమ్ములు. చిన్నారులను ఇబ్బందికి గురి చేస్తుంటాయి వానాకాలంలో వచ్చే జలుగు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు. ఇల్లంతా చెమ్మగా ఉండడం, చల్లని గాలి, బట్టలు సరిగా ఆరకపోవడం.. ఇలా అనేక కారణాలు వ్యాధులను త్వరగా దరి చేరుస్తాయి. పెద్దలని సైతం ఇబ్బంది పెడుతుంది జలుబు. మరి దీని నివారణకు, సీజనల్ వ్యాధులనుంచి ఉపశమనానికి కొబ్బరినూనె, కర్పూరం బాగా పనిచేస్తాయి. 
* కొబ్బరి నూనెను వేడిచేసి అందులో కాస్త కర్పూరం తీసుకుని మెత్తగా పొడి చేసి కలపాలి. అది పూర్తిగా కరిగిపోయాక శుభ్రమైన సీసాలో దాన్ని భద్రపరచాలి. ఈ నూనెని కొద్దిగా తీసుకుని వేడిచేసి చిన్నారుల ఛాతిపై రాస్తే లోపల పేరుకున్న కఫం తొలగిపోతుంది. ముక్కు దిబ్బడ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
* ఈ ఆయిల్‌ను రాత్రిపూట శరీరం మొత్తానికి మసాజ్ చేస్తే చర్మ వ్యాధులు, శరీరంపై వచ్చే రాషెస్ తగ్గుతాయి.
* గుప్పెడు తులసి ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. దానిలో రెండు మూడు చుక్కల కర్పూరం ఆయిల్ కలిపి మొటిమల మీద రాయాలి. ఓ అరగంట పాటు అలానే ఉంచుకొని తరువాత శుభ్రం చేసుకుంటే మొటిమలు నివారింపబడతాయి.
* రెండు మూతల కర్పూరం ఆయిల్‌కి, రెండు మూతల కొబ్బరి నూనె కలిపి కొద్దిగా వేడిచేసి తలకు రాసుకోవాలి. ఓ గంట తరువాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేస్తే తలలో దురద తగ్గుతుంది.
* కర్పూరం నూనెకు షాంపు కలిపి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
ఆస్తమా, ఎలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు ఇంట్లో దుమ్మూ ధూళి లేకుండా చూసుకోవడంతో పాటు, పక్క దుప్పట్లు, దిండు గలీబులు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. బట్టలు ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చూసుకుంటూ సాధ్యమైనంతవరకు తినే ఆహారం వేడిగా ఉండేలా చూసుకోవాలి. పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.