కమెడియన్ హరిబాబు అరెస్ట్..

comedian-and-red-sandal-smuggler-haribabu-arrest
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుల్లితెర కమెడియన్ హరిబాబును తిరుపతి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడు.  అతని కోసం టాస్క్ పోర్స్‌ పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
ఒకప్పుడు టీవీ సీరియల్స్‌లో నటించే హరిబాబు అక్రమ సంపాదనే లక్షంగా ఎర్రచందనం అక్రమంగా తరలించేవాడు.  అతను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే ఓ సినిమాకు హరిబాబే పెట్టుబడి పెట్టినట్లు ఫిలింనగరంలో వార్త హల్చల్ చేస్తోంది.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -