ఎవరెంతగా అడ్డుపడినా లక్షా 12 వేల పోస్టులను..

creating-jobs-for-locals-is-govts-priority-ktr

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగాలు భర్తీ కాకుండా విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఎవరెంతగా అడ్డుపడినా లక్షా 12 వేల పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు కబుర్లు చెప్తున్నారని.. నమ్మవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని కేటీఆర్ ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌..  తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్మించిన ఐటీఐ కళాశాల భవనాన్ని మంత్రులు నాయిని నర్సింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన కేటీఆర్.. ఐటీఐ కళాశాల ప్రారంభంతో ఇక్కడున్న విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కళాశాలలో చదివిన పిల్లలకు భవిష్యత్తులో త్వరగా ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాకుండా విపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం అని మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందన్న కేటీఆర్.. తెలంగాణకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తుండడాన్ని కేంద్రం గుర్తించిందని చెప్పారు.

ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు.. అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కృష్ణా, గోదావరి నీళ్లను ఒడిసిపట్టి.. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని.. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని.. అందరి అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -