కాబోయే ప్రధానిని నేనే: జాన్వీ కపూర్

dhadak-star-janhvi-kapoor-thinks-she-can-be-the-prime-minister-of-india
నిన్న గాక మొన్న తెరపైకి వచ్చింది. నటించిన సినిమా ఇంకా రిలీజ్ కానేలేదు. అప్పుడే రాజకీయాల గురించి మాట్లాడుతుంది. ఏకంగా ప్రధాని పోస్టుకే టెండర్ పెట్టింది అనుకుంటున్నారు కదూ జాన్వీ కపూర్ గురించి. అందాల తార శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కష్టపడి తనుకు తాను ప్రూవ్ చేసుకుంటేనే గుర్తిస్తారనే విషయం మొదటి సినిమాతోనే తెలుసుకుంది జాన్వీ. తాను నటించిన థడక్ సినిమా ఈ నెల 20 న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ‘హార్పర్ బజార్’ అనే మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ చిత్రంలో నటించిన ఇషాన్, జాన్వీలు. సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో జాన్వీ కూడా ఫన్నీగానే సమాధానాలు చెప్పింది. అందులో భాగంగానే కాబోయే ప్రధాని ఎవరు అంటే ” నాకు అనిపిస్తుంది నేనేమో అని” అంది. వెంటనే నాలిక్కరుచుకుని ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం రాయొద్దు అని బతిమాలుతోంది ఇంటర్వ్యూయర్‌ని. మరి ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.