ఖర్జూరం రాత్రి పూట వేడి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే..

health-benefits-of-dates
చిన్నారులు చీటికి మాటికి కడుపునొప్పి అంటూ ఉంటారు. పాలు తాగే పసివాళ్లు కూడా సడెన్‌గా గుక్కపట్టి ఏడుస్తుంటారు. ఎందుకో అర్థం కాదు కడుపు నొప్పేమో అని డాక్టర్ ఇచ్చిన మందులు వేస్తుంటాము. అన్నిటికీ మందులు వేయకుండా కొన్ని వస్తువులతో ఇలా కూడా చేసి చూడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. చిన్నారులకు పట్టే డబ్బా పాల వల్ల కూడా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. అటువంటప్పుడు శుభ్రంగా కడిగిన రెండు, లేక మూడు ఖర్జూర పండ్లను తీసుకుని వేడినీటిలో రాత్రిపూట నానబెట్టాలి. ఉదయాన్నే ఈ గుజ్జుని రెండు స్పూన్లు తినిపిస్తే పిల్లలకు కడుపు ఉబ్బరం తగ్గి విరేచనం సాఫీగా అవుతుంది. ఇది పిల్లలకే కాదు మలబద్దకంతో బాధ పడే పెద్దవారికి కూడా మంచిదే. ఖర్జూర పండులో ఉండే ఇనుము, కాల్షియం శరీరానికి మేలు చేస్తుంది. కాబట్టి ఖర్జూరం నీళ్లు రోజూ తీసుకున్నా మంచిదే. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్దక సమస్యని దూరం చేస్తుంది. మరికొన్ని ఉపయోగాలు..
* రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. మూత్రాశయానికి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి.
*  పెద్ద పేగు సమస్యలు తొలగిపోతాయి.
*  దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్త హీనత సమస్యలు నివారించబడతాయి.
*  బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
*  ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
*  ఇంకా ఈ పండులో విటమిన్ బి5 ఎక్కువగా ఉండడం వలన చర్యానికి మేలు జరుగుతుంది.
*  జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -