అతని ఆస్తులను చూసి ఐటీ టీమ్‌కే కళ్లు బైర్లు కమ్మాయి

it-raids-on-tn-highway-contractor

చెన్నైలోని ప్రముఖ కాంట్రాక్టర్, ఎస్పీకే గ్రూప్ ఓనర్ నాగరాజన్ సెయ్యాదురై ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు సంచలనంగా మారాయి. ఏకంగా అతని ఇంట్లో దొరికిన ఆస్తులు చూసి ఐటీ టీమ్‌కే కళ్లు బైర్లు కమ్మాయి. ఇప్పటి వరకూ SPK కన్‌స్ట్రక్షన్‌ గ్రూప్‌కి చెందిన ఆఫీసులు, ఇళ్లలో జరిపిన సోదాల్లో.. 160 కోట్ల రూపాయల క్యాష్, 100 కేజీలకుపైగా బంగారం సీజ్ చేశారు. నోట్లకట్టలన్నీ ట్రావెల్ బ్యాగుల్లో ప్యాక్ చేసి.. ఇంట్లో ఉన్న కార్లలో సైతం దాచి పెట్టారు. వీటితోపాటు వేల కోట్ల రూపాయల  ఆస్తులకు సంబంధించిన పత్రాల్ని కూడా ఇన్‌కంట్యాక్స్ అధికారులు సీజ్ చేశారు.