విజయవంతంగా కొనసాగుతున్న జగన్ పాదయాత్ర

jagan-prajasankalpa-yatra-run-successfully

వైసీపీ అధినేత జగన్‌ పాద యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రం కాకినాడలో కొనసాగుతోంది. ఇవాళ కాకినాడ రూరల్‌ కొవ్వాడ గ్రామంలో జగన్‌ పాదయాత్ర చేశారు. మొత్తం జగన్‌ పాదయాత్ర 214 రోజులు పూర్తయ్యింది. పార్టీ శ్రేణులు రైల్వే గేటు దగ్గర 65 అడుగుల భారీ కటౌట్‌తో ఆహ్వానం తెలుపగా, వందలాది మంది మహిళలు వైఎస్‌ జగన్‌కు హారతి ఇస్తూ నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటు ఇంజార్జీ కురసాల కన్నబాబు. చల్లబోయిన వేణుగోపాల కృష్ణ, జగ్గీరెడ్డిలు జగన్‌కు ఘనస్వాగతం పలికి యాత్రలో పాల్గొన్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -