నడిరోడ్డుపై హత్య.. చెల్లెలి భర్తే.. బావమరిదిపై..

man-brutally-murdered-in-Vijayawada
విజయవాడలో నడిరోడ్డుపై హత్య. సొంత చెల్లెలి భర్తే… బావమరిదిపై కత్తి దూశాడు. పట్టపగలు కత్తితో పొడిచి పరారయ్యాడు. BRTS రోడ్ లోకో పైలట్‌ ట్రైనింగ్‌ కాలేజీ సమీపంలో ఈ హత్య జరిగింది. చదలవాడ రాజు అనే వ్యక్తి గేట్‌మన్‌ ట్రైనింగ్ కోసం సిటీకి వచ్చాడు. అతన్ని ఫాలో అయిన ఇద్దరు వ్యక్తులు.. కత్తితో పొడిచి పల్సర్ బైక్‌పై పరార్‌ అయ్యారు.
కత్తిపోట్లకు గురైన రాజును ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హంతకుడు ఏ మార్గంలో వచ్చాడు.. ఎవరు సహకరించారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.