వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం..హాజరైన సీఎం కుటుంబ సభ్యులు

ministers-attend-balkampet-yellamma-kalyanotsavam

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఎల్లమ్మ కల్యాణానికి కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ సతీమణితోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తమ కుటుంబం తరపున కేసీఆర్ సతీమణి అమ్మవారికి తాళిబొట్టు సమర్పించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని కూడా అమ్మవాకిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. మేయర్ దంపతులు కూడా పూజలు, కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.