వేల సంవత్సరాలుగా పూడ్చిపెట్టబడిన నిజం!

mohini-movie-trailer
చెన్నై బ్యూటీ త్రిష ప్రేక్ష‌కుల‌ని భయపెట్టడానికి రెడీ అయింది. ప్ర‌స్తుతం ఆమె తెలుగులో సినిమాలు చేయ‌క‌పోయిన‌ప్ప‌టికి త‌మిళం, మ‌ల‌యాళంలో మాత్రం వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తుంది.
హారర్ థ్రిల్లింగ్ కథాశంతో రూపొందిన ‘మోహిని’ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా  ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు చూపించారు దర్శకుడు మాదేష్. చాలా ఏళ్లుగా పగతో రగిలిపోతున్న ‘మోహిని’.. తన పగను ఎలా తీర్చుకుందనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కుతోంది. ‘‘ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చిపెట్టబడిన నిజం..’’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.