కరక్కాయ కేసులో మరో ట్విస్ట్..

new-twist-in-hyderabad-a-cheater-fools-people-saying-karakkaya-business

కరక్కాయ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పౌడర్ కేసులో బాధితుల సంఖ్య 150కి చేరింది.మార్చి నెలలో కూకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్ నెంబర్ 1లో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను అనీల్ కుమార్ దేవరాజ్ తో పాటు మల్లీఖార్జున్ మరికొందరూ ప్రారంబించారు.వెబ్ ఛానల్,పత్రికలు,ఒక యాప్ ద్వారా ఆకర్షనీయమైన ప్రకటనలు చేశారు.1000 డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయలు ఇస్తామని వాటిని 15రోజుల్లో పౌడర్ చేసి ఇస్తే డిపాజిట్ తో పాటు మరో 300 కలిపి మొత్తం 1300 ఇస్తామని ప్రకటించారు. అయితే మొదటి నెలలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు.తరువాత తరువాత పేద మధ్యతరగతి మహిళలు,నిరుద్యోగులు రావడం మొదలు పెట్టారు.