మోరల్ పోలీసింగ్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

no-one-can-take-law-into-their-hands-duty-of-state-to-ensure-order-prevent-mobocracy-supreme-court-o

మోరల్ పోలీసింగ్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గో సంరక్షణ పేరుతో దాడులు సరికాదని పేర్కొంది.  ఇటీవలి కాలంలో అపరిచితులపై దాడులు జరగడం వంటి ఘటనలు పెరిగిపోతుండడంపై విచారణ జరిపిన కోర్టు.. ప్రజాస్వామ్యంలో మోరల్ పోలీసింగ్‌కు చోటు లేదని పేర్కొంది. శాంతిభద్రతలను అదుపు చేసే బాధ్యత రాష్ట్రాలదేనని పేర్కొంది. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదని, హింసకు తావు లేదని తెలిపింది. దాడులపై పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. మూకుమ్మడి భౌతిక దాడులను నిలువరించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో… కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 4 వారాల్లో తెలిపాలని సుప్రీం డెడ్‌లైన్ విధించింది. ఆగస్ట్ 28కి తదుపరి విచారణను వాయిదా వేసింది సుప్రీం.