భార్య శవం పక్కనే ఏడు రోజులు.. అనంతరం..

paralysed-man-sits-next-to-wifes-body-for-7-days
కుటుంబాన్ని పోషించాల్సిన భర్త మంచం పట్టాడు. పూటగడవడం కోసం భార్యే పని చేస్తూ అతడిని పోషిస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారవారలో భార్యా భర్తలు నివాసం ఉంటున్నారు. భర్త ఆనంద్‌కి పెరాలసిస్ వచ్చి కదలేని స్థితిలో ఉన్నాడు. మంచం మీదే ఉన్న అతడికి సేవలు చేస్తూ కుటుంబ పోషణ నిమిత్తం పనికి వెళ్లేది అతడి భార్య గిరిజ మడివాళ్. గత కొద్ది రోజులుగా ఆమె కూడా అనారోగ్యం పాలైంది. ఓ రోజు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో మృతి చెందింది. కదలలేని స్థితిలో ఉన్న ఆనంద్‌కి భార్య చనిపోయిందన్న విషయం కూడా తెలియలేదు. అలాగే ఏడు రోజులు భార్య మృతదేహం పక్కనే ఉన్నాడు. ఇరుగు పొరుగువారు గిరిజ ఇంటి నుంచి దుర్వాసన రావడం గమనించి లోపలికి వచ్చి చూశారు. వారు వచ్చి చూసేసరికి ఆనంద్ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. పోలీసులు ఆనంద్‌ని ఆసుపత్రికి తరలించి గిరిజకు అంత్యక్రియలు నిర్వహించారు.