రేపటి నుంచి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఎప్పటివరకంటే..

parliament-monsoon-session-speaker-sumitra-mahajan-to-meet-mps-tomorrow

రేపటి నుంచి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఆగస్టు 10 వరకు జరిగే ఈ సెషన్‌లో కీలక బిల్లులు ఆమోదింపచేసుకోవాలని కేంద్రం పట్టుదలగా ఉంది. ఈ మేరకు విపక్షాల సహకారం కోరుతూ ఇవాళ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అటు, సభలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్న విపక్షాలు నిన్ననే సమావేశమై చర్చించాయి. అటు, టీడీపీ ఎంపీలు కూడా ఇవాళ ప్రత్యేకంగా సమావేశమై అవిశ్వాసం నోటీసు విషయంలో అనుసరించే విషయంపై చర్చించారు. రేపటి నుంచే సమావేశాలు ఉన్నందున బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ జరగబోతోంది. మొత్తంగా ఢిల్ల రాజకీయం ఇప్పుడంతా హాట్ హాట్‌గా ఉంది.