గురువారెడ్డి సెల్ఫీ సూసైడ్‌ కేసులో పోలీసులకు షాక్!

selfie-suicide-case-in-Vijayawada
విజయవాడలో సెల్ఫీ సూసైడ్‌కి పాల్పడిన గురువారెడ్డి కేసులో నిందితులు పోలీసులకు షాక్‌ ఇచ్చారు. గురవారెడ్డి భార్య, అత్తింటి వారి కోసం పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తుంటే.. వారు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం ధరఖాస్తు చేసుకున్నారు.
మరోవైపు పరారీలో ఉన్న గురువా రెడ్డి భార్య గాయత్రి, ఇతర కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ అతడి బంధువులు నిరసనకు దిగారు. స్టేషన్‌ దగ్గర బైఠాయించి.. ధర్నా చేశారు.. పోలీసుల తీరుతోనే నిందితులు తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటిలోగా నిందితులను అరెస్ట్‌ చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.