సీనియర్‌ నటి కన్నుమూత

senior-actress-rita-bhaduri-dies
సీనియర్‌ నటి రీటా భాదురి(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాథపడుతున్న రీటా.. మంగళవారం ఉదయం  తుదిశ్వాస విడిచారు. దాదాపు  ఆమె  400 చిత్రాల్లో  నటించారు. నటుడు శిశిర్‌ శర్మ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఆమె మరణవార్త విషయాన్ని తెలియజేశారు. రీటా పలు  సీరియళ్లలో కూడా నటించారు.  అమ్మ, అమ్మమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరు. సాయింత్రం ముంబైలోని  అంధేరీలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.