అప్పటినుంచే నా జీవితం మారిపోయింది – సన్నీలియోన్

Sunny-Leone-tweet
పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్‌గా మారిన శృంగార తార సన్నీలియోన్. యూత్‌కి నిద్రలేకుండా చేస్తున్న ఈ బ్యూటీ  హిందీతోపాటు త‌మిళ‌, తెలుగు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా పాపులారటీ సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె చేసిన ఓ ట్వీట్ వైరల‌్‌గా మారింది.
ఇద్ద‌రు పిల్ల‌ల‌కు స‌రోగ‌సీ ద్వారా త‌ల్లిగా మారిన స‌న్నీ.. అంత‌కు ముందే ఓ బాలిక‌ను ద‌త్త‌త తీసుకుంది. గతేడాది జూలై 16న దత్తత తీసుకున్న బాలికకు నిషా వెబర్ కౌర్ అని పేరు పెట్టింది. నిషాని దత్తత తీసుకుని సంవత్సరం పూరైనా సందర్భంగా సన్నీ ఓ ట్వీట్ చేసింది.
‘నిషా నిన్ను మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మా జీవితం మారిపోయింది. నీతో ప‌రిచయమై ఓ జీవిత‌కాలం పూర్త‌యిన‌ట్టు అనిపిస్తోంది. ఈ ప్ర‌పంచంలోనే అత్యంత అంద‌మైన ఆడ‌పిల్ల‌వు నువ్వు` అంటూ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం స‌న్నీలియోన్ జీవిత‌కథ ఆధారంగా `క‌రణ్ జీత్ కౌర్‌.. ది అన్‌టోల్డ్ స్టోరీ` పేరుతో వెబ్ సిరీస్ ప్రసారమ‌వుతోంది.