శరత్ ను చంపిన వాడిని షూట్ చేసిన అమెరికా పోలీసులు

suspect-killing-indian-student-sharath-koppu-shot-dead

ఆమెరికాలో  తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శరత్‌ కొప్పు(25)ను  హత్యచేసిన నిందితుడ్ని అమెరికా పోలీసులు కాల్చిచంపారు. శరత్‌ను కాల్చివెసి  పరారీలో  ఉన్న   నిందితుడ్ని పట్టుకోనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులు జరపడంతో వెంటనే పోలీసులు  ఎదురుకాల్పులు  జరిపారు. ఈ  కాల్పులు  దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. వారం నుంచి నిందుతుడు కోసం గాలిస్తున్న  పోలీసులు ఆదివారం నిందితుడ్ని గుర్తించారు.మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసులు  నిందితుడ్ని పట్టుకొనే  ప్రయత్నం చేయగా అతడు  వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించాడు. దీంతో అధికారులు సైతం ఎదురుకాల్పులు జరిపారు.దుండగుడిని పోలీసులు కాల్చిచంపడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.