స్వామి అగ్నివేష్‌ పై బీజేపీ కార్యకర్తల దాడి..

swami-agnivesh-beaten-up-in-jharkhand-allegedly-by-bjp-workers

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌ పై  బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు దాడి చేశారు. జార్ఖండ్‌లోని లిట్టిపాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాకూర్ పట్టణానికి స్వామి అగ్నివేష్ చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ యువ మోర్చా, విశ్వహిందు పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు… అగ్నివేష్‌ హోటల్ నుంచి బయటకు రాగానే ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన బట్టలను చింపేశారు. నల్ల జెండాలను ప్రదర్శించిన ఆందోళనకారులు..ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వామి అగ్నివేష్.. క్రిస్టియన్ మిషనరీ సంస్థలతో చేతులు కలిపి.. జార్ఖండ్‌లోని గిరిజనులను క్రిస్టియన్లుగా మారుస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. అయితే తాను హింసకు వ్యతిరేకమని… తనపై దాడిఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు.. స్వామి అగ్నివేష్‌.