అగ్రదేశాల అధినేత మధ్య మరో ఆసక్తికర సమావేశం

Trump-and-Putin-meet-in-Helsinki
అగ్రదేశాల అధినేత మధ్య మరో ఆసక్తికర సమావేశం ఇవాళ జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో సమావేశమయ్యారు. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు పుతిన్‌ను ట్రంప్ అభినందించారు.
ఇక తమ చారిత్రక భేటీలో ఏయే అంశాలపై మాట్లాడారొ ట్రంప్ వివరించారు. వాణిజ్యం, మిలిటరీ, మిస్సైల్స్, అణ్వాయుధాలు, చైనా.. ఇలా అన్నింటి గురించి మాట్లాడామని స్పష్టంచేశారు. కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య అంత మంచి సంబంధాలు లేవని.. కానీ భవిష్యత్తులో అమెరికా, రష్యా సంబంధాలు ఇంకాస్త బలపడతాయని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.