ఇది మంచి విషయం కాదు..చాలా చెడ్డ విషయం

trump-putin-helsinki-summit-live-updates-us-president-says-talks-went-very-well-calls-russia-probe-a-disaster
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశం ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో జరిగింది. ఈ సందర్భంగా 2018 ఫిఫా వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు పుతిన్‌ను ట్రంప్ అభినందించారు. ఇక తమ చారిత్రక భేటీలో ఏయే అంశాలపై మాట్లాడారొ ట్రంప్ వివరించారు. వాణిజ్యం, మిలిటరీ, మిస్సైల్స్, అణ్వాయుధాలు, చైనా.. ఇలా అన్నింటి గురించి మాట్లాడామని స్పష్టంచేశారు. కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య అంత మంచి సంబంధాలు లేవని.. కానీ భవిష్యత్తులో అమెరికా, రష్యా సంబంధాలు ఇంకాస్త బలపడతాయని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.
 ప్రపంచమంతా అమెరికా, రష్యా కలిసి నడవాలని భావిస్తున్నాయని… ప్రపంచంలో ఈ రెండు దేశాలే అతిపెద్ద అణు శక్తి కేంద్రాలన్నారు ట్రంప్‌. 90 శాతం అణ్వాయుధాలు తమ దగ్గరే ఉన్నాయని.. నిజానికి ఇది మంచి విషయం కాదు. చాలా చెడ్డ విషయమన్నారు ట్రంప్… పుతిన్‌తో ట్రంప్ చాలాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలూ మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆరోపణలపై పుతిన్‌తో సుదీర్ఘంగా చర్చించానని ట్రంప్ చెప్పారు. రష్యా ఏ విదేశీ ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోలేదని పుతిన్ పునరుద్ఘాటించారు.

సూటిగా, దాపరికాల్లేకుండా, చాలా ఫలవంతంగా తమ మధ్య చర్చలు జరిగాయన్నారు ట్రంప్. అనేక విషయాలపై తామిద్దరం సుదీర్ఘంగా చర్చించామన్నారు… పుతిన్ తో భేటీని సమర్థించుకున్నారు ట్రంప్‌. అధ్యక్షుడిగా.. అమెరికాకు ఏది ఉత్తమమైనదో.. అమెరికా ప్రజలకు ఏది ఉత్తమమైనదో దానికే ప్రాధాన్యమిస్తానన్నారు ట్రంప్.. ఈ సందర్బంగా  పుతిన్ మాట్లాడుతూ  ఆయుధాల నియంత్రణ మీద నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ భద్రత విషయంలో ‘‘అణ్వస్త్ర శక్తులుగా తమ మీద బాధ్యత ఉందని పేర్కొన్నారు. అమెరికా, రష్యాల సైనిక వ్యూహాల పరస్పరం ఎదురుబొదురుగా ఉన్న సిరియాలో మరింత సహకారం అవసరమని పుతిన్ పిలుపునిచ్చారు.