రాజకీయంగా ఆసక్తిరేపుతున్న ఉండవల్లి,చంద్రబాబు భేటీ

undavalli-meets-chandra-babu

సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీ రావడం రాజకీయంగా ఆసక్తిరేపింది. విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటంపై కొద్ది రోజుల క్రితం సీఎంకు ఉండవల్లి లేఖ రాశారు. దీంతో.. CMO ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చిన ఆయన.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్లమెంటు తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారని ఫిబ్రవరి 7, 2018న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబుకు ఉండవల్లి గుర్తుచేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలనే పార్లమెంటులో ప్రస్తావించాలని, ఆ వ్యాఖ్యలను ఆధారం చేసుకునే సీఎంను కోరానని, తన దగ్గర ఉన్న ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేశానని పేర్కొన్నారు.