పోలీసు అధికారిని చెట్టుకు కట్టేసి చితకబాదిన మహిళ..

villagers-beat-police-punjab

ప్రజలను కాపాడాల్సిన పోలీసులే మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే బాధితులు ఇంకెవరికి చెప్పుకోవాలి.. బాధ్యత మరచి ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ పోలీసు అధికారి. దీంతో అతన్ని చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామస్థులు. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. పీకలదాక మద్యం సేవించిన ఓ పోలీసు అధికారి మద్యం మత్తులో తనపై  అత్యాచారం చేయబోయాడని ఓ మహిళ గ్రామస్థులకు తెలిపింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు అతన్ని పట్టుకొని చెట్టుకి కట్టేసి ఆమె చేతనే చితక బాధించారు. ఈ విషయం తెలుసున్న పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.