పసుపు పచ్చని దంతాలకు చిన్న చిట్కా.. 3 నిమిషాల్లోనే మిలమిలా..

Whiten-Teeth-at-Home-in-3-Minutes
మీ అందమైన ముఖానికి చిన్న చిరునవ్వే చక్కని ఆభరణం. మరి మనసారా నవ్వాలంటే మీ పలువరుస పచ్చగా ఉంటే చూసే వారికి ఇబ్బంది. ఎంత దాచుకుందామన్నా దాగనిది. రెండు పూటలా బ్రష్ చేసుకున్నా పళ్లకి పట్టిన గార వదలట్లేదని బాధ. మరి మనకి ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం ఉంది. అందేంటో తెలుసుకుందాం..
 
కేవలం రెండే పదార్థాలు 1. బేకింగ్ సోడా 2. నిమ్మరసం. 
ఓ చిన్న బౌల్ తీసుకుని అందులో ఓ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దానికి సగం చెక్క నిమ్మరసం పిండాలి. ఈ రెంటిని బాగా కలపాలి. వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దంతాలపై రుద్దాలి. ఓ మూడు నిమిషాలు బ్రష్ చేసినట్టుగా వేలితో రుద్దాలి. తరువాత నోటిలో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించాలి. ఆశ్చర్యకరంగా మీ పచ్చని దంతాలు తెల్లగా మెరిసిపోతుంటాయి. సో.. అదండీ చిట్కా. ఈ రోజే ప్రయత్నిస్తారా మరి..
మరికొన్ని చిట్కాలు తెలుసుకుందాం..
తులసి టూత్ పౌడర్
గుప్పెడు తులసి ఆకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి. ఆరిన తరువాత వాటిని మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పొడితో పళ్లు రుద్దుకుంటే కూడా పచ్చని దంతాలు తెల్లగా మారే అవకాశం ఉంది. రోజూ వాడే పేస్టుకి ఈ తులసి పౌడర్ జత చేసినా మంచిదే. ఇతర సమస్యలకు కూడా తులసి పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి దానితో పళ్లు తోముకున్నా పసుపు రంగు మీద ప్రభావం చూపిస్తుంది.
లవంగాలను పొడి చేసి పేస్టుతో కలిపి రుద్దుకుంటే కూడా ఫలితం ఉంటుంది. దీని వల్ల పళ్లు ధృఢంగా కూడా తయారవుతాయి.