ఆనంద్ మహీంద్రాని ఆశ్చర్యపరిచిన బాలుడు.. వీడియో వైరల్

anand-mahindras-whatsappwonderbox-unveils-again-video-of-boy-rolling-up-a-tyre-goes-viral

ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే వారి విజయం ప్రపంచానికి తెలుస్తుంది. పల్లెటూరి పిల్లలు ప్రపంచ విజేతలు కాకపోవచ్చు. కానీ ఇక్కడి చిన్నారులు అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించినంత ఆనందాన్ని పొందుతున్నారు. గల్లీలో ఈ చిన్నారులు ఆడే ఆటలు వారికి ఎవరు నేర్పించారని ఆనందంగా ఆడేస్తున్నారు. గెలుపు సాధించిన విజయం వారి ముఖాల్లో వెలిగిపోతుంది.  ఓ పక్క చినుకులు పడుతున్నా చెదరని చిరునవ్వుతో పాతటైర్లో కూర్చొని రోడ్డుకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చక్కర్లు కొడుతున్నారు. సిటీల్లో ఉండే పిల్లలు పొందని ఆనందాన్ని వీరు సొంతం చేసుకున్నారు. వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు అంటూ నాలుగ్గోడల మధ్యే బాల్యాన్ని బంధించకుండా వీధుల్లో విహరిస్తున్నారు ఈ చిన్నారులు. మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఇలాంటి స్ఫూర్తి దాయక వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. తనని సైతం ఇన్‌స్పైర్ చేసిన విధానాన్ని వివరిస్తుంటారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.