దీపికా పెళ్లి స్విట్జర్లాండ్‌లో కాదు!

బాలీవుడ్ లో సక్సెస్‌పుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి దీపికా ప‌దుకునే. గత కొంతకాలంగా రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తుంది. ఈ జంట నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారనే మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వీరి పెళ్లి గురించి ఇప్పటి వరకూ దీపిక గానీ, రణవీర్ గాని స్పందించలేదు. గత కొంతకాలంగా లవ్‌లో ఉన్న ఈ జంట స్విట్జర్లాండ్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. తాజాగా వీళ్ల వేదిక విషయంలో మరో వార్త హల్ చల్ చేస్తోంది.

వీరి వివాహం స్విట్జర్లాండ్ నుంచి ఇటలీకి మారినట్టు బాలీవుడ్ టాక్. ఈ జంట పెళ్లి గురించి స్పందించకపోవటం.. పెళ్లి వేదిక విషయంలో ఇంత రహస్యంగా ఉంచడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.