శబరిమలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

entry-to-women-in-Sabarimala-temple-Supreme-Court

శబరిమలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పురుషులతోపాటు మహిళలకు సమాన హక్కులుంటాయని తద్వారా ఆలయంలోకి మహిళలకు అనుమతి ఉండాలని తీర్పు చెప్పింది. ఆలయం అనేది ప్రైవేట్ ప్రాపర్టీ  కాదని ఎవరైనా ప్రార్ధనలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశంపై నిషేధానికి సంబంధించిన అంశంపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్ధానం ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ప్రాతిపదికన మహిళలకు ప్రవేశాన్ని మీరు నిరాకరిస్తారు..? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..ప్రజల కోసం ఆలయాన్ని తెరిచారంటే ఎవరైనా అందులోకి వెళ్లవచ్చ’ని పేర్కొన్నారు.