అరుదైన ఫ్లయింగ్ స్నేక్.. దీని ప్రత్యేకత ఏంటంటే..

huge-flying-snake-found-srisailam-forest

శ్రీశైలం అడవిలో అరుదైన ఫ్లయింగ్ స్నేక్  గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. బుధవారం ఉదయం సున్నిపెంట లోని సాయిబాబా గుడి సమీపంలో ఈ పాము ఎగురుతూ.. స్థానికుల కంటపడింది. దాంతో భయాందోళన చెందిన స్థానికులు స్నేక్ బాయ్స్ కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అష్రాఫ్,కిరణ్,లు ఈ పామును పట్టుకొని ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళి కృష్ణ కు అప్పజెప్పారు. తెల్లగా.. నల్లటి కట్లు మరియు సూది లాంటి తల కలిగిన ఈ పాము చెట్లపై ఎగురుతూ ఒకచోటనుంచి మరోచోటుకు వెళుతుంది. ఆంధ్రప్రదేశ్ లో దీన్ని కనుగొనడం ఇది రెండవసారి. మొదట ఈ ఫ్లయింగ్ స్నేక్ ను  శేషాచలం అడవుల్లో గుర్తించారు. ఆ తరువాత శ్రీశైలం నల్లమల అడవిలో సంచరిస్తుండగా గుర్తించారు.  ఈ పాము ఎక్కువగా శ్రీలంక, లక్షదీవుల ఫారెస్ట్ లలో మాత్రమే సంచరిస్తుందని అధికారులు తెలిపారు. కాగా నల్లమల  అడవులల్లో ఇలాంటి స్నేక్ దొరకటం ఇదే మొదటి సారి అని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.