మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో!

రిలయన్స్ దిగ్గజం జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మానుసూన్ హంగామా ఆఫర్‌లో బాగంగా పాత జియో ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో మార్చుకుని కొత్త ఫోన్‌ను పొందే సదుపాయాన్ని కల్పించింది.  పాత జియో ఫోన్‌ను మార్చుకుని.. రూ. 501  చెల్లిస్తే కొత్త జియో ఫోన్‌ను ఇవ్వనున్నట్లు  ముఖేష్ అంబానీ ఇటీవలే ప్రకటించారు.
జూలై 21 సాయంత్రం 5.00 గంటల నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్‌ కోసం మై జియో యాప్‌లో గానీ, జియో అధికారిక వెబ్‌సైట్‌లో గానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంస్థ సూచించింది.
గతంలో జియో ఫీచర్ ఫోన్ కొన్న ప్రతీ ఒక్కరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకుని కొత్త ఫోన్‌ను పొందవచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా చెల్లించే రూ.501 తిరిగి వినియోగదారునికి రిఫండ్ రూపంలో ఇవ్వరు.  మొదట చెల్లించిన రూ. 1500 మాత్రమే రిఫండ్‌లో భాగంగా ఫోన్ కొన్న నాటి నుంచి మూడేళ్ల తర్వాత చెల్లిస్తారని జియో సంస్థ తెలిపింది.