రూ.700 కోట్ల చిత్రం అట్టర్ ప్లాప్.. షాక్ లో సినీ పరిశ్రమ..

producers-chinas-most-expensive-film-asura-pull-it-cinemas

చైనా సినిమా ఇండస్ట్రీకి చెందిన రూ.700 కోట్ల భారీ చిత్రం అట్టర్ ప్లాప్ అయింది. థియేటర్ లలో ప్రేక్షకులు లేక వెల వెల బోయాయి.  టిబెటన్‌ బుద్దిస్ట్‌ల పౌరాణిక కథల నేపథ్యంలో చైనా నిర్మాణ సంస్థ అలీబాబా పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘అసుర’ చైనా చలనచిత్ర పరిశ్రమలోనే ఖరీదైన చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. అయితే నాలుగు రోజులకే ఇదే సినిమా అత్యంత చెత్త రికార్డు నమోదుచేసింది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వారంరోజులు కూడా పూర్తి కాకుండానే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 113 మిలియన్ డాలర్ల ఖర్చుతో తెరకెక్కిన అసుర కేవలం 7.3 మిలియన్‌ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సినిమాను మంగళవారం రాత్రినుంచే థియేటర్ నుంచి తీసేశారు. అసుర ప్లాప్ తో చైనా సినీ పరిశ్రమ షాక్ లో మునిగిపోయింది.