అది మాత్రం చెప్పను.. రహస్యం : ప్రభాస్ హీరోయిన్

sanjana-revealed-his-love-story
వెండితెర నుంచి బుల్లితెరకు షిప్ట్ అయిన నటి సంజన. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ  కన్నడ భామ చూపు ఇప్పుడు టీవీ సీరియల్స్‌పై పడింది. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిందట. ఆయన్ను చూడగానే పడిపోయానని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటోంది.
మణిపాల్ హాస్పిటల్ లో జరిగిన వేడుకలో అతన్ని చూడగానే  పడిపోయానని చెప్పుకొచ్చింది. అతను ఓ డాక్టర్ అని చెప్పిన ఈ భామ ఆయన పేరు మాత్రం ఇప్పుడే చెప్పను అది రహస్యం అంటుంది.. మరి ఇంతకి ఈ భామను ప్రేమలోకి దించిన ఈ డాక్టర్ ఎవరై ఉంటారు? మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో అంటూ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.