తొలిసారిగా ఆ పాత్రలో సుమంత్..

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్న చిత్రం ఇదం జగత్.

ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఆగస్టు ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.