ఆమె మరణంలో ఎలాంటి అనుమానాలు లేవు

ఢిల్లీలోని పంచ్‌షీల్ పార్కులో ఆత్మహత్య చేసుకున్న జర్మన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ హోస్టెస్ అసిస్యా బాత్రా. ఆమె మృతికి సంబంధించిన  రెండో శవపరీక్ష నివేదికను పోలీసులు బహిర్గతం చేశారు. మెడపై బలమైన గాయాలు ఉన్నట్లు నివేదికలో తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.తన భర్త మయాంక్ సింఘ్వీకి ఇంతకుముందే వివాహం అయినట్లు తెలుసుకున్న బాత్రా మనస్ధాపానికి గురై  భవనం నుంచి దూకి  ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మొదట నిర్వహించిన శవ పరీక్షలో బాత్రా తల్లిదండ్రులు  పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు రెండోసారి శవ పరీక్ష నిర్వహించారు.  బాత్రా భవనం పైనుంచి దూకడంతో  ఆమె శరీరానికి  15 చోట్ల బలమైన గాయాలు తగలడం వలనే ఆమె మృతి చెందిందని  శవపరీక్ష నివేదిక స్పష్టం చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.