జ్యూవెలరీ కంపెనీని మోసం చేసిన బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌?

‘బిగ్‌ బాస్‌ హౌస్‌’లో ‘మిస్‌ రైట్‌’గా పిలుచుకునే హీనా ఖాన్‌ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ జ్యూవెలరీ కంపెనీలో రూ.12 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను ఆమె చోరీ చేసినట్లు వార్త హల్‌చల్ చేస్తోంది.

‘బిగ్‌ బాస్‌ 11’ మాజీ కంటెస్టెంట్‌ అయిన హీనా ఖాన్‌ ఓ బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనలో నటించింది. ప్రకటన షూటింగ్‌ అనంతరం వాటిని కంపెనీకి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకుందట. ఇందుకు‌గాను సదరు కంపెనీ హీనా ఖాన్‌కు లీగల్‌ నోటీసులు కూడా పంపారనే వదంతులు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై హీనా తన ట్విటర్‌ ద్వారా స్పందించింది.. ‘లీగల్‌ నోటీస్‌లు ముందు నా ఇంటికి రాకుండా మీడియా హౌస్‌కు ఎలా వెళ్లాయనేది నాకు అర్ధం కావడం లేదంటూ’ ట్వీట్‌ చేసింది.