కృష్ణానగర్‌లో అగ్నిప్రమాదం..మూడవ అంతస్తులో..

హైదరాబాద్ కృష్ణానగర్‌లోని ఆదిత్య కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లతో గంటకు పైగా శ్రమించి అధికారులు మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ తగలబడినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -