ఆ అమ్మాయిల కోసం షూటింగ్ ఆపేసిన మహేష్!

మహేష్ బాబు.. ఇది పేరు కాదు.. అమ్మాయిల్లో కలిగే ఫీలింగ్స్‌కి ఇట్స్ ఎ బ్రాండ్.. ఆయన స్ర్కీన్ మీద కనబడితే చాలు అమ్మాయిల్లో  వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంటాయి.

ఆయనకు టీనేజీ అమ్మాయిల్లో ఉండే క్రేజ్.. ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న కాలేజీ బ్యూటీస్‌ కలల రాకుమారుడు నిజంగా కలిస్తే ఎలా ఉంటుంది.. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది అనుభవించే వారికే తెలుస్తుంది. ఇలాంటి ఫీలింగ్ కొంతమంది యువతులకు కలిగిందట.

ఇటీవలే మహేష్ 25వ సినిమా షూటింగ్  డెహ్రాడూన్‌లో జరిగింది. ఆయన్ను కలిసేందుకు యువతులు చాలా దూరం నుంచి షూటింగ్ స్పాట్‌కు వెళ్లారట.

విషయం తెలుసుకున్న మహేష్ షూటింగ్‌ను కొంచెం సేపు ఆపి మరీ వెళ్లి వారితో మాట్లాడి.. ఫోటోలు దిగారట. దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. మా కలల రాకుమారుడు ఏం చేసినా ట్రెండీగానే ఉంటుంది అంటూ ఫుల్లు ఖుషీ అయిపోయారు. ఆయనతో దిగిన ఓ పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇదికాస్తా వైరల్‌గా మారింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయటానికి చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది.