ర్యాంప్‌పై అమ్మతనం.. వాక్ చేస్తూనే బిడ్డకు పాలు..

అమ్మ.. ఆకాశంలో విహరించినా.. అంతరిక్షంలో కాలు మోపినా.. అమ్మగా తన బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటుంది. వృత్తికి గౌరవాన్ని ఇస్తూనే బిడ్డకు తన ప్రేమను పంచుతుంది. మురిపెంగా లాలిస్తుంది. గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డకు పాలిచ్చి పడుకోబెడుతుంది. మియామీకి చెందిన ఓ మోడల్ మారా మార్టిన్ తన వృత్తిలో భాగంగా బికినీ ధరించి ర్యాంప్ వాక్ చేస్తోంది. ఆడియన్స్‌లో కూర్చున్న వారిలో తన 5 నెలల బిడ్డ కూడా ఉంది. ఆకలితో ఉన్న బిడ్డ ఏడుపు వినిపించింది మార్టిన్‌కి. మనసు నిలువలేదు. వెంటనే తన బిడ్డను ఎత్తుకుని ర్యాంప్‌పై వాక్ చేస్తూనే బిడ్డను పొదివి పట్టుకుని పాలిచ్చింది. మోడల్‌గా తన వృత్తికి న్యాయం చేస్తూనే బిడ్డ ఆకలిని తీర్చిన మార్టిన్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మార్టిన్ తనను ప్రశంసిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -