ఫోన్ పడిపోయింది.. ఎక్కడో తెలిస్తే షాక్..

టాయ్‌లెట్లోకి వెళ్లిన వాళ్లలో కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అందులో పేపర్ చదవడం ఒకటైతే, ఫోన్ మాట్లాడడం మరొకటి. పాపం అక్కడ కూడా ఖాళీగా ఉండకూడదనుకుంటారో ఏమో బహు బిజీ పర్సన్స్. ముంబైకి చెందిన 19ఏళ్ల రోహిత్ కూడా టాయ్‌లెట్‌కి వెళ్లేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్లాడు. మాట్లాడుతుంటే అది కాస్తా జారి బేసిన్‌లో పడి పోయింది. కంగారు పడిపోయిన రోహిత్ ఫోన్ తీద్దామని చెయ్యి బేసిన్‌లో పెట్డాడు. ఫోన్ దొరకడం సంగతి అటుంచి చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. ఎంతకీ రావట్లేదు.లాభం లేదని గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఇంట్లో వారు టాయ్‌లెట్లో రోహిత్ పెట్టిన అరుపులు విని ఏం జరిగిందో అని కంగారు పడిపోయి తలుపు పగల గొట్టి లోపలికి వచ్చారు. వారు కూడా రోహిత్ చేతిని పైకి లాగడానికి ప్రయత్నించారు. అయినా రాకపోయేసరికి ఇరుగు పొరుగు వారి సహాయంతో అగ్ని మాపక సిబ్బందికి  కబురు చేశారు. వారు వచ్చి 5 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి టాయ్‌లెట్ బేసిన్‌ని పగలగొట్టి అతడి చేతిని బయటకు తీసారు. ఈ క్రమంలో ఫోన్ ముక్కలు ముక్కలైంది. పాపం రోహిత్ 5గంటల ప్రయత్నంలో అలసి పోయాడు. టాయ్‌లెట్లోనే పడిపోయాడు.