అత్తగారికి చీరె పెట్టిన బాలకృష్ణ భార్య..

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటిస్తుండగా, ఆయన భార్య బసవతారకం పాత్రను బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పోషిస్తుంది. షూటింగ్ నిమిత్తంగా నగరానికి విచ్చేసిన విద్యాబాలన్‌కి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఆతిథ్య సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు చీరను బహుకరించారు బాలకృష్ణ భార్య వసుంధర. ఆమెని కుమార్తె తేజశ్విని, అల్లుడు భరత్, సోదరి లోకేశ్వరిలు ఆప్యాయంగా పలుకరించారు. తల్లి బసవతారకం గురించిన అనేక విషయాలను బాలకృష్ణను, లోకేశ్వరిని అడిగి తెలుసుకున్నారు విద్యాబాలన్‌.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.