మోక్షజ్ఞ సరసన రకుల్ ఫైనల్..?

rakul-preet-play-role-ntr-biopic

దివంగత మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో  ‘ఎన్టీఆర్ బయోపిక్’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిలింనగర్లో హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో నందమూరి వారసుడు, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కనిపించనున్న సంగతి తెలిసిందే. యువ ఎన్టీఆర్‌కు జోడిగా రకుల్‌ జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రకుల్‌ ఎన్టీఆర్‌కు పాలు అమ్మే మహిళ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ పాత్రకోసం రకుల్ ను సంప్రదించగా టక్కున ఒప్పేసుకున్నట్టు సమాచారం.