టీవీలో చర్చ.. లైవ్‌లో లాయర్‌‌ని చెంప దెబ్బలు కొట్టిన నేత: వీడియో వైరల్

ట్రిపుల్ తలాక్‌పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్. ఇందులో ముస్లిం మత పెద్ద మౌలానా ఎజాజ్ అర్షద్ ఖాస్మి, సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది, మరో ఇద్దరు ప్రముఖులు పాల్గొన్నారు. న్యూస్ రీడర్ సీరియస్‌గా డిస్కషన్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే మౌలానా-ఫరాల మధ్య మాటల యుద్ధం జరిగింది. లైవ్ జరుగుతుందున్నవిషయాన్నిమరిచిపోయి వారిద్దరూ తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు.  వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహం పట్టలేక మౌలానా మహిళా న్యాయవాదిపై చేయి చేసుకున్నారు, చెంప మీద కొట్టారు. దీంతో కంగారు పడిపోయిన మిగతా సభ్యులు గొడవను ఆపే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ మౌలానా తగ్గకపోవడంతో ఛానెల్ ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేశారు.