కేంద్రంపై నిప్పులు చెరిగిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

mp-kinjarapu-rammohan-naidu-fire-on-central-govt
విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని… శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన రామ్మోహన్‌ నాయుడు… ఇదీ అదీ అన్న తేడా లేకుండా అన్ని అంశాలపై కేంద్రాన్ని కడిగి పారేశారు. హిందీలో, ఇంగ్లిష్‌లో అనర్గళంగా ప్రసంగించిన యువనాయకుడు… కేంద్రం ఏపీ ప్రజలను నిలువునా మోసం చేస్తోందన్నారు. నాలుగేళ్ల నుంచి చేయని సాయం.. 24 గంటల్లో చేస్తామంటూ హరిబాబు ఎవరిని మోసం చేస్తున్నారని ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.