ఏపీ ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం : మల్లికార్జున ఖర్గే

congress-loksabha-leader-mallikarjuna-kharge-talks-on-andhrapradesh

ఏపీ ప్రజల డిమాండ్‌కు కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్ఎస్పీ, ముస్లింలీగ్ పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలోని 5 అంశాలకు సంబంధించి.. ప్రత్యేక హోదా, లోటు భర్తీ, గ్రాంట్లు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, ఏడు మండలాల విలీనం గురించి స్పష్టంగా చెప్పామని ఖర్గే అన్నారు. ఏపీ ప్రజలకు పూర్తి స్థాయి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడమంటే బీజేపీ పురాణ కథలు చెబుతోందని ఖర్గే ఆరోపించారు.