గూగుల్ సూచించిన ఇడియట్..

idiot-google-shows-trump-photos

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఇడియట్ గా సూచిస్తోంది సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్.. గూగుల్ లో ఇడియట్ అని సెర్చ్ చేస్తే కేవలం ట్రంప్ ఫోటోలు, అయనకు సంబంధించిన ఆర్టికల్స్ మాత్రమే వస్తున్నాయి. మానిటర్ మొత్తం ట్రంప్ ఫొటోలతోనే నిండిపోతోంది. అయితే అందులో గూగుల్‌ తప్పిదం ఏం లేదంటోంది. ఇదిలావుంటే అప్పుడప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వడం గూగుల్‌కు అలవాటే. అలానే  ఈ సారి  ఏకంగా భారీ తప్పిదం చేసి వార్తల్లో నిలిచింది ఈ సర్చ్‌ ఇంజన్‌.