టీడీపీకి వ్యతిరేకంగా జనసేనాని ట్వీట్లు

janasena-chief-pawan-kalyan-fire-on-tdp
పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై వాడిగా, వేడిగా చర్చ సాగుతున్న వేళ.. కొన్ని ట్వీట్లతో రచ్చ రాజేశారు పవన్ కళ్యాణ్. టీడీపీ నాయకులపై తన అక్కసును వెళ్లగక్కారు. లోక్‌సభలో టీడీపీ వాదన బలహీనంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాను డిమాండ్‌ను వినిపించలేకపోయారని పవన్‌ ట్వీట్‌లో విమర్శించారు.
*టీడీపీకి వ్యతిరేకంగా జనసేనాని పవన్‌ ట్వీట్లు
*లోక్‌సభలో టీడీపీ వాదన చాలా బలహీనం: పవన్
*ప్రత్యేక హోదా డిమాండ్‌ను వినిపించలేకపోయారు: పవన్
*హోదాను డిమాండ్ చేసే నైతికత కోల్పోయారు: పవన్
*వ్యక్తిగత లాభాల కోసం మూడున్నరేళ్లుగా హోదాకు తూట్లు పొడిచారు: పవన్
*ఈరోజు వ్యర్థమైన ప్రసంగాలు చేసి లాభమేంటి?: పవన్
*దశాబ్దాల అనుభవం కలిగిన నాయకులకు..
*కేంద్రం వంచన తెలియడానికి ఇన్నేళ్లు పట్టిందంటే నమ్మాలా?: పవన్
*ప్రజల వెనుక నిలబడాల్సిన వీళ్లు రాజకీయాలకు సమయం, డబ్బు వృధా చేశారు: పవన్
*ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ నాయకులకు ఎలా కనిపిస్తున్నారు?: పవన్
*కేంద్రం హోదా ఇవ్వదని రెండేళ్ల క్రితమే చెప్పాం: పవన్‌
*పాచిపోయిన లడ్డూలాంటి ప్యాకేజ్‌ను కళ్లకు అద్దుకుని మమ్మల్ని తిట్టారు: పవన్
*ఏపీ ప్రజల హృదయాలను గెలుచుకునే మంచి అవకాశాన్ని టీడీపీ పోగొట్టుకుంది: పవన్