వివాహేతర సంబంధం : వ్యక్తి దారుణ హత్య

murder-kagaznagar-adilabad

వివాహేతర సంబంధం అనుమానంతో వ్యక్తిని దారుణంగా హతమార్చాడు మరో వ్యక్తి.ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం వంజీరి గ్రామం టీఆర్‌నగర్‌ రోడ్డుపై జరిగింది. వంజిరి గ్రామానికి చెందిన కృష్ణ , రామగుండానికి చెందిన మహేష్. ఇద్దరు కలిసి వంజీరి సిమెంట్‌ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. కృష్ణ సొంత ఊరు వంజీరి కావడంతో మహేష్ అతని ఇంటికి వస్తుండేవాడు. అయితే మహేష్ కు తన భార్యకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించేవాడు కృష్ణ. ఈ క్రమంలో మహేష్ ను తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు. అయితే గురువారం కృష్ణ, మహేష్ లు కలిసి  టీఆర్‌నగర్‌లో బస్సు దిగారు.. అక్కడినుంచి వంజీరి వెళ్లే ముందు మద్యం తాగారు. అనంతరం గ్రామానికి వెళ్తుండగా కృష్ణ తనతో తెచ్చుకున్న కత్తితో మహేశ్‌ను విచక్షణారహితంగా పొడిచాడు. అయితే  మహేశ్‌ తప్పించుకునే ప్రయత్నం చేయగా గొడ్డలితో నరికి ఆపై బండరాయితో మొహంపై మోదాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే మరణించాడు.అనంతరం ఘటనాస్థలినుంచి కృష్ణ పరారయ్యాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.